టీడీపీకి మరోషాక్ తగిలింది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్న టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ ప్రకటన చేశారు. ఇవాళ గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తన కుటుంబాన్ని చూసుకుంటానని పేర్కొన్నారు.
మా తాత రాజగోపాల్ నాయుడు వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజాస్వామ్యం లో కొన్ని వ్యవస్థలు, ఫుల్ టైం కొన్ని వ్యవస్థలు పార్ట్ టైం పని చేస్తాయని చెప్పారు. చివరి మూడు సంవత్సరాలుగా నేను క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేను…కానీ పార్లమెంట్ లో గుంటూరు ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానని వెల్లడించారు. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు. ఎంపీ గా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్ లో కేవలం 24 శాతమే పూర్తి స్థాయిలో పని చేసే పార్లమెంట్ సభ్యులు ఉన్నారన్నారు. మిగిలిన వారు ఏదో ఒక రంగం లో కొనసాగుతూ రాజకీయాలు చేస్తున్నారు. బిజినెస్ మన్‌గా నాకు ఉన్న నాలెడ్జ్ ప్రజల కోసం ఉపయోగించాలని అనుకున్నానని తెలిపారు. పదేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నాం…కానీ ప్రయోజనం లేదన్నారు. ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.