Thursday, November 21, 2024

సౌర విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం: పయ్యావుల

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌర విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన సోలార్ విద్యుత్ ధరల్లో అవకతవకలు జరిగాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలు యూనిట్ రూ.1.99 కే కొనుగోలు చేస్తే.. ఏపీలో మాత్రం రూ.2.49కి కొన్నారని చెప్పారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.30 వేల కోట్ల మేర లావాదేవీలకు గంటల్లోనే ప్రతిపాదనలు, ఆమోదాలు తెలపడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొన్నామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత నవంబరులో పిలిచిన టెండర్లలో యూనిట్ రూ.2కే సౌర విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. గుజరాత్ రూ.1.99కే కొనుగోలు చేసిందన్న పయ్యావుల.. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రూ.2.49 ధర ఎలా చౌక అవుతుందని నిలదీశారు. ఈ లెక్కన సెకీ నుంచి డిస్కంలకు చేరేసరికి యూనిట్ ధర రూ.4.50 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు. దీని వెనుక భారీ అవినీతి దాగి ఉందని అన్నారు. ఈ సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారం స్కీమ్ కాదని, అదానీ కోసం చేసే స్కామ్ అని  పయ్యావుల ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement