Wednesday, November 20, 2024

టీడీపీలో గోరంట్ల సంక్షోభానికి తెర?

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడుతారని ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన.. టీడీపీని వీడేందుకు సిద్ధమైమయ్యారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ కావడం సర్వత్ర ఆసక్తి రేపింది.

టీడీపీలో గోరంట్ల సంక్షోభానికి తెర పడుతుందా? అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తనకు గౌవరం ఇవ్వడం లేదంటూ పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో రగిలిపోతున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి.. తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పడం పార్టీలో అప్పట్లో కలకలం రేగింది. సీనియర్‌నైనా తనకు గుర్తింపు లేదని, తనమాటకు విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పదవులు తాను చెప్పిన వారికివ్వలేదని ఆక్షేపించినట్లు సమాచారం. ఈ పరిణామాల అనంతరం నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబే రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఎమ్మెల్యే గోరంట్లకు ఫోన్ చేసిన చంద్రబాబు.. దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. అన్ని సమస్యలూ పరిష్కరించుకుందామని ఆయనకు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయన్ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గోరంట్ల నేడు చంద్రబాబుతో భేటీ అయినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: తండ్రి వైఎస్ సమాధి సాక్షిగా.. జగన్, షర్మిల కలిసిన వేళ..

Advertisement

తాజా వార్తలు

Advertisement