Monday, November 18, 2024

TDP Manifesto – 2 : రుణ‌మాఫీ మంత్రం …సంక్షేమ తంత్రం …

అమరావతి, ఆంధ్రప్రభ: రానున్న ఎన్నికల కోసం దాదాపు 9 నెలల ముందు మినీ మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజల్లోకి దూసుకువెళ్తున్న టీ-డీపీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దసరానాటికి పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది.రాజకీయ చాణిక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు తన రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు.ఈ క్రమంలోనే మరోసారి ప్రజా ఆకర్షక మేనిఫెస్టోతో అన్నివర్గాల ప్రజలపై వరాలు కురిపించేందుకు కసరత్తు ప్రారంభించారు. భవిషత్తుకు గ్యారెంటీ- పేరిట పార్ట్‌-1 మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక వర్గాల ప్రజలను ఆకర్షించడానికి సూపర్‌సిక్స్‌ పాలసీలను ప్రకటించారు. వైసీపీ కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

దీనిలో భాగంగా పార్ట్‌- 2 మానిఫెస్టో విడుదల చేయాలని భావిస్తున్నట్లు- విశ్వసనీయ సమాచారం. ముఖ్యం గా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీపై కీలక ప్రకటన పార్ట్‌-2 మేనిఫెస్టోలో ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు పెద్ద మొత్తంలో రుణ మాఫీ హామీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని విశ్వసనీయ సమాచారం.అలాగే ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి మిళితంగా మినీ మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. ఉపాధిని సృష్టించే, రాష్ట్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పథకాలను ప్రకటించడం తో పాటు-,రైతు లు, మహిళలకు వరాలు కురిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటు-న్నారని తెలుస్తోంది. పేదలకు ఆర్థిక ఆసరా,ఆరోగ్య పథకాలు కూడా ఈ మేనిఫెస్టో లో ఉండనున్నాయి. మహానాడు వేదికగా భవిష్యత్‌కు గ్యారంటీ- పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు.
అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసు కెళ్లారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు, మహిళలకు, రైతులు, బీసీలకు పెద్ద పీట వేశారు. మహిళా లోకం కోసం 3 సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయా ణం వంటి పథకాలు ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు వీటికి మించి పార్ట్‌ -2 మేనిఫెస్టో ఉంటు-ందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు,నేతల నుండి వ్యక్తం అవుతోంది. కాగా సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని టీ-డీపీ భావిస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రాన్ని దివాళా తీయాల్సిన అవసరం లేదని, అప్పులభారం మోపాల్సిన అవస రం లేదని, అయితే అది రాష్ట్రంలో సంపదను సృష్టించడం ద్వారానే సాధ్యమవు తుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీ-డీపీ అధినేత ఆలోచన చేస్తున్నారు. త్వరలో జిల్లాల పర్యటన చేయనున్న చంద్రబాబు పార్ట్‌ -2 మానిఫెస్టో అంశాలు, హామీలు ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement