కడపలోని పాత మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న అన్న క్యాంటీన్ భవనాన్ని కూల్చివేడంపై స్థానిక టీడీపీనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప టీడీపీ ఇంచార్జ్ అమీర్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు నిరసన వ్యక్తంచేశారు. రూ. 25 లక్షల రూపాయల వ్యయంతో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ నిర్మించి పేదలకు రూ. 5 కే నాణ్యతతో భోజనం అందించెదని ఆపార్టీ నేతలు అన్నారు. నగరం నడిబొడ్డున ఈ అన్నా క్యాంటీన్ ఎంతో పేరుపొందిందని, ప్రతి ఒక్కరు గర్వించేవారని తెలిపారు. ఈ క్యాంటీన్ ప్రాంతంపై కన్నుపడి కబ్జా చేసేందుకు వైసీపీ నాయకులు కూల్చివేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చి,పేదలకు కడుపునింపే అన్నా క్యాంటీన్లను మూసేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ లను కొవిడ్ సెంటర్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా ఉపయోగించుకుంటుండగా ఉన్నట్టుండి అర్ధరాత్రి కూల్చడం రాక్షసత్వం అన్నారు. కూల్చిన క్యాంటీన్ భవనాన్ని వెంటనే నిర్మించాలని లేని పక్షంలో ఆందోళలనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కూల్చివేతకు కారకులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అన్నా క్యాంటీన్ భవనం కూల్చివేత.. పునర్నిర్మించాలంటూ టీడీపీ ఆందోళన
Advertisement
తాజా వార్తలు
Advertisement