నర్సాపురం, అక్టోబర్ 27 ప్రభ న్యూస్. సామాజిక సాధికారికత పేరుతో వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర ఆ పార్టీకి ఇదే చివరి యాత్ర అవుతుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పొత్తూరి రామరాజు విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణం లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో పార్టీ నేతలు బస్సు యాత్ర పై ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా రామరాజు మాట్లాడుతు బస్సు యాత్రతో మంత్రులు అధికార దుర్వినియోగంనకు పాల్పడుతున్నారని, ఎన్నికలలో ఇచ్చిన హామీలు లో ప్రధాన హామీలను అమలుచేయలేదన్నారు.వై సి పి ప్రభుత్వంను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని, చంద్రబాబు నాయుడు ను అక్రమంగా జైలుకు పంపి వై సి పి నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
సీనియర్ నేత, కొవ్వలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఎన్ ఆర్ ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడుమాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గం లో సి ఎమ్ జగన్ రూ 3200కోట్లు అభివృద్ధి పనులకు బటన్ నొక్కరు గాని… ఒక్క రూపాయి పని కూడా ప్రారంభం కాలేదని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు పై కక్ష పూరిత చర్యలు తప్ప రాష్ట్రా భివృద్ధి పై లేదన్నారు. ఆ పార్టీ నేతలు ఎన్ని యాత్రలు, ఎన్ని హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ మండిపడ్డారు. టిడిపి అగ్నికుల క్షత్రియ రాష్ట్ర కన్వీనర్ కొప్పాడ రవి మాట్లాడుతూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకే బస్సు యాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు. సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు బర్రె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు