కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కొనసాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయాలను పాటించి జనసేన ఉపఎన్నికకు దూరంగా ఉంది. టీడీపీ తన అభ్యర్థిని పెట్టలేదు. అయితే, బీజేపీ మాత్రం బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పలువురు టీడీపీ నేతలు.. బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా బూతుల్లో కనిపించారు.
వాస్తవానికి బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి నామమాత్రంగా కూడా కార్యకర్తలు లేరనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపుపై ధీమా లేకున్నా బరిలో నిలిచింది. అయితే, వైసీపీకి మెజార్టీ తగ్గించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి తదితరుల టీడీపీ నాయకులు మద్దతు కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: ఓటేసి ఈటల.. గెలుపుపై ధీమా