ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ పథకంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఓటిఎస్ పేరుతో పేదల నుంచి రూ.5 వేల కోట్లు దోచుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసిందని ఆయన ఆరోపించారు. చట్ట ప్రకారం ఇప్పటికే హక్కులు సంక్రమించిన ఇళ్లకూ ఓటీఎస్ అమలు చేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. అప్పులు పుట్టకే ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో నాటకం ఆడుతోందన్నారు. పేదల ఇళ్లకు 12 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వస్తాయన్న యనమల.. వాస్తవాలను మరుగునపెట్టి సెటిల్ మెంట్ చేస్తామనడం పేదప్రజలను మోసగించడమే అని అన్నారు.
ఏడాదికి 5 లక్షల ఇళ్లు కడతామని చెప్పిన జగన్.. రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లయినా కట్టారా? అని యనమల ప్రశ్నించారు. తాను ఇచ్చిన హామీలకే జగన్ రెడ్డి తూట్లు పొడిచారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాము నిర్మించిన 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ గత ఐదేళ్లలో 10.5 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మించిందని యనమల గుర్తు చేశారు. కరోనా సమయంలో ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు దిగడం దుర్మార్గం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital