టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు(102) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఆయన నివాసంలో నిన్న తుదిశ్వాస విడిచారు. సంగం డెయిరికీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన యడ్లపాటి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలు అందించారు. 1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లాలో జన్మించారు యడ్లపాటి. 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరపున, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వేమూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1978-80 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. యడ్లపాటి మృతి విషయం తెలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement