Tuesday, November 19, 2024

ఇంటి పన్ను ఎగ్గొట్టిన ఏపీ సీఎం: నారా లోకేష్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘’ముఖ్యమంత్రి సొంత ఇంటికి పన్నులు కట్టలేదని పేర్కొన్నారు. నాడు తండ్రిని అడ్డంపెట్టుకుని, నేడు సీఎంగా ల‌క్ష‌ల కోట్లు దోచేసిన వైఎస్ జగన్ త‌న భార్య‌పేరుతో వున్న ఇంటి ప‌న్ను ఎగ‌వేసి, అదే ఇంటి నుంచి జనం స‌కాలంలో ప‌న్నులు చెల్లించాలంటూ రోజూ నీతి క‌బుర్లు చెప్ప‌డం..దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టే ఉంది. తాడేప‌ల్లిలోని త‌న ఇంటికి రెండేళ్లుగా క‌ట్ట‌ని ఇంటి ప‌న్ను అక్ష‌రాలా 13 ల‌క్ష‌ల 25 వేల 940 రూపాయ‌లు. ప‌న్ను ఎగ‌వేత‌లో రాష్ట్రంలోనే ఏ1గా జ‌గ‌న్‌ నిలిచారు. చెల్లించాల్సిన‌ ప‌న్నుపై 2ల‌క్ష‌ల 82 వేలు జ‌రిమానా ప‌డి మొత్తం 16 ల‌క్ష‌ల 67 వేలు దాటినా.. చ‌లించ‌క‌పోవ‌డం ఒక్క జ‌గ‌న్ మోస‌పురెడ్డికే సాధ్యం. జ‌గ‌న్ అస్త‌వ్య‌స్త‌ పాల‌న‌లో జ‌నం బ‌తుకు దుర్భ‌ర‌మైంది. అధిక‌ధ‌ర‌ల‌తో కుదేలైన జ‌నం నుంచి రెండింత‌లు పెంచి మ‌రీ ప‌న్నులు, చెత్త‌పై యూజ‌ర్‌చార్జీలు వ‌సూలుచేస్తోన్న జ‌గ‌న్ రెడ్డి త‌న ఇంటి ప‌న్ను క‌ట్ట‌రు. స‌కాలంలో ప‌న్నులు చెల్లించి ప్ర‌జ‌లు ఆద‌ర్శంగా నిల‌వాల్సిన సీఎం, ధ‌న‌దాహంతో ల‌క్ష‌ల రూపాయ‌ల ఇంటి ప‌న్ను ఎగ‌వేయ‌డానికి క‌నీసం సిగ్గుప‌డ‌క‌పోవ‌డం విచిత్రం ‘’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: జగన్ వద్ద మార్కులు తెచ్చుకోకుంటే.. మంత్రి పదవి పోయినట్లే

Advertisement

తాజా వార్తలు

Advertisement