నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల వేళ.. టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మున్వర్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. తన అనుచరులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమానికి టీడీపీ నేతలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ములేక టీడీపీ అనైతిక పొత్తులకు పాల్పడుతోందని మండిపడ్డారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్ లలో అభ్యర్థులు పెట్టుకునే దిక్కు కూడా తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయిందన్నారు. లోపాయికారీ ఒప్పందాలతో కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అన్ని పార్టీలు కలిసొచ్చినా ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.
ఇది కూడా చదవండి: దేశంలో రూ.60 కే లీటర్ పెట్రోల్ ?