Friday, November 22, 2024

మా పోరాటం వల్లే చీపురుపల్లి రెవెన్యూ డివిజన్: టీడీపీ నేత కిమిడి

చీపురుపల్లి ప్రజలు పోరాటాలు మేరకే రెవెన్యూ డివిజన్ సాధించుకోగలిగామని విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. అధికార పార్టీ నాయకులు తమ గురుంచి, తమ పోరాటం గురుంచి మాత్రం అబద్దాలు, మాయ మాటలు చెపుతున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీ ఉంటే గాని రెవెన్యూ డివిజన్ రాదు అని మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అనేక కార్యక్రమాల్లో చెప్పారని అన్నారు. తమ పోరాటాలని హేళన, ఎగతాళి చేశారని ధ్వజమెత్తారు.

టీడీపీ ఎప్పుడు ప్రజలు తరుపున మాత్రమే పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భోగాపురం భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయి అని అన్నారు. వైసీపీ అక్రమాలు, అవినీతిని టీడీపీ ఎప్పుడు బయటపెడుతూ ఉంటుందన్నారు. కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచి సామాన్యుడు నడ్డి విరిచారని మండిపడ్డారు. కరెంట్ కోతలు కూడా విపరీతంగా పెరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు రైతులు ఖాతాల్లోకి డబ్బులు పడలేదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement