Tuesday, November 26, 2024

ఏపీలో పుట్టబోయే బిడ్డపైనా అప్పు.. ఒక్కో ఫ్యామిలీపై రూ.2.50 లక్షల భారం!

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ రెండున్నరేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. పుట్టబోయే బిడ్డపైనా జగన్ రెడ్డి అప్పు ఉంటుందని తెలపారు. రెండున్నరేళ్లలో జగన్ సర్కార్ అప్పులు రూ.3 లక్షల కోట్లు అని అన్నారు. ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం పడుతోందని తెలిపారు. దుబారా, అవినీతి, మితిమీరిన అప్పుల కారణంగా ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల అప్పు పడుతోందని చెప్పారు. అవినీతి, దుబారా కోసం ధరల పెంపు, పన్నుల పెంపు, అప్పుల పెంపుతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని చెప్పారు. చంద్రబాబు శిశువు జన్మించినప్పటి నుంచి వారి బాగోగుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు తాగే టీ కి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు పాలనలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక జగన్ రెడ్డి పాలనలో రూ.5 వేలకు పెరిగిందన్నారు. మద్యంలో ఏడాదికి రూ.5వేల కోట్లు, ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ముడుపులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి 6 సార్లు పెంచారని కళా వెంకట్రావు మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: కుప్పంలో కుక్కల్లా మొరుగుతున్నారు: వైసీపీపై నారా లోకేశ్

Advertisement

తాజా వార్తలు

Advertisement