వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘’ఏపీలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ అంటూ హడావిడి. వారం రోజులపాటు డోసులు తగ్గించి సరిపుచ్చారు. గతంతో పోలిస్తే 80 శాతం కోతకోశారు. దాచుకున్నవి, అందుబాటులో ఉన్నవి వేసి కృత్రిమ రికార్డు. మరుసటి రోజు డీలా ! టీకాలు దాచి, మాయ లెక్కలతో ఆర్భాటం చేసి దేశ ప్రజలను మభ్యపెట్టారు కదా ? వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ఉమ విమర్శించారు.
‘గిట్టుబాటు లేని మామిడి పంట. దిగుబడి బాగున్నా దిగులు తప్పలేదు. దళారులు, మీ నాయకులు సిండికేట్ గా మారి దోచుకుంటున్నారు. ధరల భారీ పతనాన్ని నిరసిస్తూ ఆందోళన. లక్షల వ్యయం చేసి పంట పండిస్తే, ప్రభుత్వ విధానాలతో చివరికి అప్పులే అంటున్న మామిడి రైతుల కష్టాలు కనబడుతున్నాయా వైఎస్ జగన్?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.