Tuesday, November 26, 2024

ఐటీ పాలసీనే లేదు..విశాఖని ఐటీ నగరం చేస్తారా?

వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీకి పెట్టుబడులు రావడం లేదని, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. నాడు నారా చంద్రబాబు నాయుడు విశాఖకి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చారని, ప్రపంచ దిగ్గజాలని నగరానికి ఆహ్వానించారని గుర్తు చేశారు. నేడు లులూ, డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐబీఎంని పక్కరాష్ట్రాలకి తరలించారని విమర్శించారు. ఉత్తరాంధ్ర యువతకి వేల ఉద్యోగాలు లేకుండా చేసారని మండిపడ్డారు.  మూడో ఏడాదిలో కూడా కనీసం ఐటీ పాలసీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖని ఐటీ నగరం చేస్తారా ?  వైయస్ జగన్ అంటూ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement