Tuesday, November 26, 2024

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ వర్సెస్ వైసీపీ

పెరిగిన పెట్రో, నిత్యావసరధరలను వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. బైక్‌ ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీ శ్రేణులతో నాయకులు భారీ ర్యాలీలు చేపట్టారు. పలుచోట్ల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెట్రల్ ధరల పెంపును నిరసిస్తూ దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎడ్ల బండిని నడిపారు. దెందులూరు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తుండగా అనుమతి లేదంటూ  చింతమనేనిని పోలీసులు అడ్డగించారు. పోలీసుల తీరుపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో చింతమనేని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చింతమనేనికి,  పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు అధికారులకు చింతమనేని ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు.  అనంతరం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement