Friday, November 22, 2024

Breaking: టీడీపీ నేత బుద్ధా వెంకన్న విడుదల..

మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న విడుదలయ్యారు. నిన్న మంత్రి, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ అనంతరం స్టేషన్ బెయిలుపై రాత్రి 11.15 గంటలకు విడుదల చేశారు.

కాగా, బుద్ధా వెంకన్న అరెస్టుకు ముందు.. నిన్న ఉదయం మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కొడాలి నానికి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించినట్టు సాక్ష్యాధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ అని ఆరోపించారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని, అలాంటి వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబు తప్పని అన్నారు. నాని గత చరిత్ర గురించి అందరికీ తెలుసన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు మేరకు బుద్ధా వెంకన్నపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన  పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు మూడు గంటలపాటు పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య చర్చల అనంతరం భారీ బందోబస్తు మధ్య వెంకన్నను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రి వరకు విచారించిన పోలీసులు అనంతరం విడిచిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement