వైసీపీ పాలనలో అవినీతి, ఆరాచకం రెండూ ఎక్కువేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ పాలనలో డ్యాంలు నిండినా.. చుక్కనీరు వాడుకోవడానికి పనికిరాదని దుయ్యబట్టారు. కర్నూలు న్యాయ రాజధాని అనగానే.. రాష్ట్రం కరోనా కల్లోలంలో చిక్కిందన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించగానే ఎల్జీ పాలీమర్స్, సాయినార్, హెచ్పీసీఎల్, షిప్‌యార్డ్ ప్రమాదాలలో వందల మంది చనిపోయారని విమర్శించారు. దుర్గమ్మకి చీర సమర్పించేందుకు వెళ్తే కొండచరియలు విరిగిపడటం, కచ్చులూరు బోటు ప్రమాదంలో 60 మంది చనిపోయారని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఇదంతా ఎవరి పాదం వల్ల జరిగిందో మంత్రి అనిల్ చెప్పాలని డిమాండ్ చేశారు. పులిచింతల అవినీతిపై విచారణ జరిపితే అవినీతి చేయించిన మహామేత లేకపోయినా.. చేసిన యువమేత ఉన్నందున అడ్డంగా దొరుకుతాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో ఉండి అన్నింటికీ చంద్రబాబే కారణమని చెప్పడానికి కనీసం సిగ్గు పడటం లేదని విమర్శించారు. పులివెందుల పులకేశీల పాపం పులిచింతలకి శాపమైతే చంద్రబాబుపై ఏడుపెందుకు అని అయ్యన్న ప్రశ్నించారు.
ఇది కూడా చదవండిః ఏపీలో మైనార్టీలకు రక్షణ ఏదీ? : లోకేష్