ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కు పరిపాలన చేతకావడం లేదని అన్నారు. పరిపాలన చేతకాని వారికి ఓట్లు వేస్తే.. ఎలా ఉంటుందో అర్థమైందన్నారు. రాష్ట్ర ఆదాయం ఏంటి ? దుబారా ఏంటి? అని ప్రశ్నించారు. విశాఖ భూముల్ని తాకట్టు పెట్టారని, టూరిజం మంత్రికి తెలియకుండా టూరిజం రిసార్ట్స్ కూల్చేశారని మండిపడ్డారు. హెటిరో డ్రగ్స్ రైడ్స్‌లో దొరికిన డబ్బంతా జగన్ దోచుకున్న సొమ్మెనని అయ్యన్న ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికైనా సరే జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే దమ్ముందా? అని నిలదీశారు. 38 ఏళ్ల తన రాజకీయ జీవితంలో గంజాయి వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఇంట్లో కూర్చుంటానని, మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. గంజాయి వ్యాపారం చేస్తున్నవారు ఎవరో పోలీసులకు తెలుసని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: పనిమనుషులుగా చేరి.. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే..