ఏపీ సీఎం జగన్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. గతేడాది రబీకి సంబంధించిన ధాన్యం బకాయిలు ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాక విడుదల చేశారని…ఇదీ రైతుల పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని విమర్శించారు. ధాన్యం బకాయిల విడుదలతో జగన్ నెలల తరబడి ఆలస్యం చేశారు కాబట్టి… రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిల కోసం అన్నదాతలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ధాన్యం రైతులు నష్టపోయారని వెల్లడించారు. రైతు వ్యతిరేక విధానాలతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు.
బకాయిల విడుదలకు నెలల తరబడి ఆలస్యం చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలా రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం పట్ల జగన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. గత ఐదారు నెలలుగా ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించలేదు. రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ఎవరు భరిస్తారు? చంద్రబాబు హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నగదు చెల్లించారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత గడువును 21 రోజులకు పెంచారు. అయినా గడువులోగా చెల్లించడంలో విఫలమయ్యారు అన్నారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో సమంతాదే అతిపెద్ద నోరు.. గిన్నిస్ రికార్డు