ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో వివక్ష చూపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. నిధులు, అధికారాలున్న కార్పొరేషన్లు జగన్ రెడ్డి సొంత వర్గానికా? కుర్చీలు లేని ఛైర్మన్‌లు బలహీనవర్గాలకా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి కీలక పదవుల్లో సింహభాగం ముఖ్యమంత్రి సామజిక వర్గంతో నింపుకున్నారని తెలిపారు. వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ.. విద్యావంతులైన నిరుద్యోగులపై లేదని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల్ని డమ్మీల్ని చేశారని విమర్శించారు. నిధులు, అధికారాలు ఉన్న పదవుల్ని సొంత వారికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు కనీసం కుర్చీ కూడా లేని ఛైర్మన్ పదవుల్ని కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలను దెబ్బతీశారని మండిపడ్డారు. బలహీన వర్గాల అణచివేతే లక్ష్యంగా అధికారం చెలాయిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పదవులా?: అచ్చెన్న
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- Ap government
- AP Nesw
- AP NEWS
- ap news today
- Ap political news
- AP politics
- CM JAGAN
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- ysrcp government
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement