Sunday, November 24, 2024

AP: టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ.. ఉమ్మడి కార్యాచరణపై చర్చ

జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ హోటల్ లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను రూపొందించనున్నారు.100 రోజుల ఉమ్మడి కార్యాచరణను, మానిఫెస్టో రూపకల్పనపై చర్చించనున్నారు.


చర్చించే అంశాలు ఇవే…
ఈ భేటీలో జనసేన ఆరు కీలక అంశాలను మానిఫెస్టో పెట్టేందుకు ప్రతిపాదించింది.

  1. దాదాపు 30 లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా కార్యాచరణ.
  2. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా రూ.10లక్షల చొప్పున సాయం.
  3. వ్యవసాయం – బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
  4. ఉద్యాన పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు.
  5. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహాం.. ఇబ్బందుల్లేని వ్యవసాయం.
  6. మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ.. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు.. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు చేసే పలు అంశాలను జనసేన ప్రతిపాదించింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement