Thursday, January 16, 2025

AP | పసుపు సైన్యం @కోటి…

  • సభ్యత్వాలలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా టీడీపీ

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది అక్టోబర్‌ 26న తెదేపా అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అండమాన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కేవలం వంద రోజుల వ్యవధిలో తెదేపా సభ్యత్వ నమోదులో చరిత్రను సృష్టించింది.

ఇప్పటివరకు సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య కోటి మార్క్‌ను దాటి చరిత్రను తిరగరాసింది. కనుమ పండుగ నాడు సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగియగా అప్పటి వరకు 1 కోటి 52 వేల 598 మంది తెదేపా సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. కోటి మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా అవతరించింది.

మొదటి స్థానంలో నెల్లూరు సిటీ…

- Advertisement -

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పోటీపడి మరీ రికార్డులు సృష్టించారు. 11 నియోజకవర్గాలు లక్ష సభ్యత్వాల మార్కు దాటాయి. టాప్ టెన్‌లో నెల్లూరు సిటీ 1,49,270 సభ్యత్వాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆత్మకూరు 1,48,802, పాలకొల్లు 1,48,559 రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రాజంపేట 1,45,766, కుప్పం 1,38,446, ఉండి 1,21,527, గురజాల 1,11,458, వినుకొండ 1,06,867, మంగళగిరి 1,06,145, కళ్యాణదుర్గం 1,01,221, కొవూరు 1,00,473 నియోజకవర్గాలు వరుసగా తరువాత స్థానాల్లో నిలిచాయి.

శాశ్వత సభ్యత్వాలకు భారీ స్పందన…

టీడీపీ శాశ్వత సభ్యత్వాలకు కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి రూ.1 లక్ష రుసుంతో శాశ్వత సభ్యత్వాలకు తెదేపా శ్రీకారం చుట్టింది. మంగళగిరి-145, ఆత్మకూరు- 137, వినుకొండ- 79, గంగాధర నెల్లూరు- 62, తణుకు- 60 నియోజకవర్గాలు టాప్‌ ఫైవ్‌లో నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement