YCP గృహ సారథులకు పోటీగా TDP కుటుంబ సారథులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఒక్కో వ్యక్తికి 30 కుటుంబాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఒక మహిళ, ఒక పురుషుడు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో వైసీపీని ఎదుర్కొనేందుకే కుటుంబ సారథులు అని తెలిపారు. టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే టార్గెట్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏం చేయాలో ఎప్పటికప్పుడు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement