Thursday, November 21, 2024

అచెన్నను హత మార్చిన హంతకులు ఎవరో నిగ్గు తేల్చాలి (వీడియోతో)

కర్నూల్ – కర్నూలు కి చెందిన పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న కడప జిల్లా లో విధులు నిర్వహిస్తూ గత వారం అనుమానస్పదoగా మృతి చెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిడిపి నిజనిర్ధారణ కమిటీ సోమవారం కర్నూల్లోని 19 వ వార్డ్ లో అచ్చెన్న నివాసం లో విచారణ నిర్వహించారు. ఈ నిజ నిర్ధారణ కమిటీలో టీడీపీ రాష్ట నాయకులు మాజీ మంత్రి ఎరిక్షన్ బాబు,కొండేపి ఎమ్మెల్లే డొల వీరాంజనేయ స్వామి,పాణ్యo నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డిలు ఉన్నారు.. ముందుగా

చనిపోయిన అచ్చెన్న కుమారుడు డాక్టర్ క్లింటన్ నీ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందనీ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


వైసీపీ ప్రభుత్వం లో దళితులకు రక్షణ లేదు అన్నారు.గతం లో కూడా దళిత కులానికి చెందిన డాక్టర్ సుధాకర్ కూడా చనిపోయిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు,


ఈ అనుమస్పద మృతి లేదా హత్య? అనేది ఎలా జరిగిందో పోలీసు అధికారులు చర్యలు తీసుకొని, ఇందుకు కారణం అయిన వారిని కటినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో కర్నూల్ టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, 19 వ వార్డుు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,కోడుమూరు టీడీపీ ఇంచార్జి అకేపోగు ప్రభాకర్,లక్ష్మీపురం మరెన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement