Wednesday, November 27, 2024

మేము స్పై చేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చేదా? పెగాసెస్​ ఆరోపణలపై నారా లోకేష్​ ఫైర్​

చంద్రబాబు నేతృత్వంలోని గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేయలేదని తెలుగుదేశం పార్టీ (టిడిపి) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను నారా లోకేష్ ఖండించారు. మేం ఎప్పుడూ ఎలాంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదని లోకేష్ అన్నారు. మమతాజీ నిజంగా అలా చెప్పిందో లేదో, ఎక్కడ, ఏ సందర్భంలో చెప్పారో నాకు తెలియదు. ఒకవేళ ఆమె అలా చెబితే కచ్చితంగా తప్పుడు సమాచారం అందించినట్లేనని లోకేష్ స్పష్టంచేశారు

మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తన ప్రభుత్వానికి పెగాసస్ స్పైవేర్‌ను ఆఫర్ చేశారని, ప్రజల గోప్యతకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున దానిని తిరస్కరించినట్లు వెల్లడించారు. అసెంబ్లీలో ఆమె వెల్లడించిన సమయంలో చంద్రబాబు హయాంలో ఆంధ్ర ప్రభుత్వం కూడా పెగాసెస్ వాడింది అని పేర్కొన్నారు. కాగా, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పైవేర్ ఆఫర్ చేశారని, అయితే దానిని తాము తిరస్కరించినట్టు చంద్రబాబు కేబినెట్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ చెప్పారు. నిజంగానే తమకు పెగాసస్ ఉంటే జగన్ మోహన్ రెడ్డి తన దురాగత చర్యలన్నింటికీ ఫ్రీ అయి ఉండేవారా అని ఆయన అన్నారు. 2021 ఆగస్టులో అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ కార్యాలయం నుంచి వచ్చిన ఆర్టీఐ సమాధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను ‘ఎప్పుడూ సేకరించలేదని’ స్పష్టం చేసినట్లు నారా లోకేష్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement