Monday, November 18, 2024

గుంటూరులో పొలిటికల్ హీట్.. నారా లోకేష్ అరెస్ట్

గుంటూరు జిల్లా పరమయ్యగుంటలో పరిస్థితి ఉద్రిక్త నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేశ్‌ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది.

రమ్య ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించగా.. టీడీపీ నేతలను బలవంతంగా పోలీసులు లాక్కెళ్లారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసుల తీరుపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లోకేష్‌ను పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లోకేష్ తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేష్ ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరికొందరు టీడీపీ నేతలు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ పోలీసులు చేశారు.

టీడీపీ నేతల అరెస్టుపై ఆపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే గుంటూరులో దారుణ హత్యకు గురైన విధ్యార్దిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉన్నదన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతాపం.. తన ఇంటి సమీపంలో గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవడంలో చూపించాలన్నారు. పరామర్శకు వెళ్లిన నేతల పట్ల అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు. టీీడీపీ నేతలపై దౌర్జన్యం చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రధాని మోదీ అల్పాహార విందు

Advertisement

తాజా వార్తలు

Advertisement