ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వారియర్లను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజలను కూడా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఓ వర్గం పోలీసులు ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కొందరు పోలీసులు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ ఘటన మరవకముందే.. ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి వేధించారన్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వారిపై చిన్నచూపు తగదని తెలిపారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని చంద్రబాబు లేఖలో కోరారు.
ఇది కూడా చదవండి:ఏపీలో రేపటి నుంచి జూడాల సమ్మే..