Saturday, November 23, 2024

ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా!

తమిళనాడు సీఎం స్టాలిన్‌ను చూసి ఏపీ సీఎం జగన్ రాజకీయాలు నేర్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రైవేటు టీచర్లు, అటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు, హమాలీలు పనిలేకుండా ఇబ్బందులు పడుతుంటే వాళ్లను పరిమర్శించే ఓపిక వారికి లేదని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం టీడీపీ చేపట్టిన సాధన దీక్షలో మాట్లాడుతూ సీఎం జగన్  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటిన్ల విషయంలో సీఎం స్టాలిన్ వ్యవహారించిన తీరు ప్రశంసనీయమన్నారు. అమ్మ క్యాంటిన్ల విషయంలో వివాదం చెలరేగితే.. ఇది మంచి పర్పస్ కోసం పెట్టారని, దీన్ని తీసెయ్యడం కరెక్ట్ కాదని స్టాలిన్ ఒక్క మాటతో తేల్చి చెప్పారన్నారు. అలాగే అమ్మ క్యాంటిన్లపై దాడి చేసిన వాళ్ల సొంత పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.

అమ్మ క్యాంటిన్లను జయలలిత ఫొటో పెట్టి కొనసాగిస్తున్నారంటే.. అది కదా సరైన రాజకీయ సంస్కృతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ పేదవాడికి పూటకు రూ. 5 అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు ఏం తప్పు చేశాయని మూసివేశారని ప్రశ్నించారు. పేద ప్రజలు సంపాదించే సగం డబ్బులు మధ్యాహ్న భోజనానికి అయిపోతున్నాయని భావించి.. 5 రూపాయిలకే అన్న క్యాంటిన్ల ద్వారా భోజనం అందించినట్లు వివరించారు. కేవలం రూ. 15కే పేదవాళ్లకు మూడు పూటలా కడుపు నిండా తిండి పెట్టిన ఏకైక ప్రభుత్వం టీడీపీదే అని గుర్తు చేశారు. పేదవాడిపై సీఎం జగన్‌కు ఎందుకు ఇంత అసహనమని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇదీ చదవండి: పేదల ఇళ్ల విషయంలో జగన్‌కు రఘురామ కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement