టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్ధాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకూ అక్కడ గెలవలేదు.
ఇక 2019లో లోకేశ్ పోటీ చేసి ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.