Friday, November 22, 2024

కల్తీ సారాపై టీడీపీ ఆందోళన బాట.. నేటి నుంచి రెండు రోజుల పాటు నిరసన

కల్తీ సారా అరికట్టాలి, జె. బ్రాండ్స్ మద్యం నిషేధించాలి’ అనే డిమాండ్ తో నేటి నుంచి రెండు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమైంది. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టనున్నారు. మద్యపాన నిషేధం చేస్తాం అని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ మాట తప్పి, మడమ తిప్పారని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని బలితీసుకుంటుందని ఆరోపించారు.

కాగా, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలకు కల్తీ మద్యం, ‘జె’ బ్రాండ్ మద్యమే కారణమని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సులువుగా డబ్బు సంపాదించాలనే తపనతో ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను ఏపీలో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement