Monday, November 18, 2024

AP | వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల విధ్వంసక ఘటనలు జరిగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య కొన్నిచోట్ల ఘర్షణలు, ఉద్రిక్తత చోటుచేసుకోవడంపై చంద్రబాబు ఆరా తీశారు. వైసీపీ కవ్వింపు చర్యలకు దిగినా.. టీడీపీ శ్రేణులు ఎలాంటి దాడులు, ప్రతి దాడులు చేయకుండా ఉండాలని చంద్రబాబు కీలక సూచనలు చేశారు. సంయమనం పాటించి అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement