రాష్ట్రంలో కోవిడ్ అరికట్టడంలో ప్రభత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్ననాయుడు విమర్శించారు. ఉత్తరాంద్రలో 46 వేల కేసులు ఉంటే 6 వెంటిలేటర్ బెడ్లు 44 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని అన్నారు. 46 వేల మందిలో ఎంత మందిని కాపాడుతారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో సౌకర్యలు సామర్థ్యం పెంచకుండా ప్రభుత్వం తత్సరం చేస్తోందని మండిపడ్డారు. ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నారంటూ మంత్రులు సిగ్గుమాలిన మాటలు మాట్లాడతున్నారని ధ్వజమెత్తారు. వ్యాక్సిన్ కు మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచాయని గుర్తు చేశారు. జగన్ లేఖ రాయడం వల్లే విదేశీ టీకాలు వస్తున్నాయి అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. జగన్ కంటే ముందే ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్ లేఖ రాసారని తెలిపారు.
అబద్దాలతో ముఖ్యమంత్రి రాష్ట్రన్ని పాలిస్తున్నాడని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో 40 పేజీలతో హెల్త్ బులిటెన్ ఇస్తుంటే.. ఏపీ ప్రభుత్వం 1 పేజీ ఇస్తూ మరణాలును దాస్తోందని ఆరోపించారు. మెుదటి టీకాలు వేసుకుంటూ రాష్టాలు ముందుంటే.. మన రాష్ట్రం 25 స్థానంలో ఉందన్నారు. జగన కనీసం మాస్క్ పెట్టుకోకుండా ప్రజలు మాస్క్ పెట్టుకోండి సహజీవనం చేయాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరు మాస్కులు పెట్టుకుంటే జగన్ మాత్రం పెట్టుకోడడని పేర్కొన్నారు. కనీసం భోజనం పెట్టలేని అసమర్థుడని, అన్న క్యాంటీన్లు నాశనం చేసి పేదవాడికి అన్నలేకుండా చేశాడని మండిపడ్డారు. ప్రతివిషయం కుడా విధ్వంసమే జగన్ ధ్యేయం అని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో జయలలిత పోటో కుడా తీయ్యకుండా అమ్మక్యాంటీన్లు నడిపిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అచ్చెన్న ఆరోపించారు.