రాష్ట్రంలో తమ పార్టీ వైసీపీతో మినహా మిగతా పార్టీలన్నిటితో టీడీపీ పొత్తు పెట్టుకుందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య పెళ్లిళ్లు విడాకులు సర్వసాధారణమన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు ఎటువంటి భాష ఉపయోగించారో అందరికీ తెలుసన్నారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని ఖండించారు.
రాజకీయాల్లో నేతలకు ఓపిక ఉండాలని హితవు పలికారు. ఇక దేశంలో రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అప్పట్లో రాజధాని ఒకచోట ఉండటం వల్ల సమస్యలు తలెత్తాయన్నారు. అందువల్లే మూడు రాజధానులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.