మాఫియాకి అడ్డా తెలుగుదేశం పార్టీ అని దానికి అధిపతి నారా చంద్రబాబునాయుడు అని కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతకాలం క్రితం కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 70 శాతం పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్ని రోజులు కుప్పంలో చంద్రబాబు ఉన్నాడు అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి ఇతర మాఫియాలు రాష్ట్రంలో రాజ్యమేలాయి అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు ప్రభుత్వంపై చంద్రబాబు మాఫియా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చుట్టం చూపుగా అల్లుడులా కుప్పానికి వచ్చి వెళ్లడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడైనా కృషి చేశాడా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తీసుకువస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ప్యాకేజీకి అమ్ముడుపోయింది నువ్వు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital