Tuesday, November 26, 2024

తిరుమ‌ల శ్రీవారి సేవ‌కు అన్య‌మ‌త‌స్థులు…ప‌రిశీలిస్తామ‌న్న టిడిడి ఈవో…

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ‌వారి కలియుగ వైకుంఠ నివాసంగా భక్తులు భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటాడు. అలనాటి రాజులు నుంచి నేటి సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, దేశాధి నేతలు సహా వెంకటాచలపతి దర్శనం కోసం తహతహలాడతారు.

అయితే ఈ క్షేత్రంలో అన్యమతస్థులు అడుగు పెట్టాలంటే కొన్ని నియమ నిబంధనలున్నాయన్న సంగతి తెలిసిందే.. తాజాగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి సేవ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి సేవకు అన్యమతస్తులకు అనుమతించాలన్న భక్తుల డిమాండ్ ను పరిశీలిస్తామని ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి సేవ చేసేందుకు ఇతర మతాలకు చెందిన వారికి ఆఫ్ లైన్ ద్వారా అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని తిరుమల అన్నమయ్య భవన్ లో నేడు జ‌రిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ప్రకటించారు. నాయుడుపేటకు చెందిన ఒక ముస్లిం భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ సూచ‌న అమ‌లున‌కు అవ‌కాశాలు త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement