Monday, November 18, 2024

ఎపికి పెర‌గ‌నున్న ప‌న్ను రాబ‌డి

అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర బడ్జెట్‌ రాష్ట్రానికి కొంత మోదాన్నీ.. కొంత ఖేదాన్ని కలిగించింది. ప్రధానంగా బడ్జెట్‌లో ఎపీ ప్రతిపాదనలను కేంద్రం పరిగణలోకి తీసుకోవ డం… పన్ను రాబడి పెరగ డం… పలు సంస్థలకు నిధుల కేటాయింపులు తదితర అంశాలు రాష్ట్ర అభివృద్ధికి దోహద పడగా మరోవైపు విభ జన హామీలు… వెనుకబడిన జిల్లాల అభివృద్ధి… పోలవరం కు నిధుల కేటాయింపు… ఎరువుల సబ్సిడీలో, ఉపాధి హామీ నిధుల్లో కోత లాంటి అంశాలు కొంత నిరాశ కలిగించాయి. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ విభజన గాయాలతోపాటు- కోవిడ్‌ మహమ్మారి విసిరిన సంక్షోభంతో రాష్ట్రం ఇబ్బందులు పడుతోన్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కరుణ చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టు-కుంది. కోవిడ్‌తో రాష్ట్రం భారీగా ఆదాయం కోల్పోయింది. మరోవైపు ఉమ్మడి ఏపీ విభజన జరిగిన నాటి నుంచి రాష్ట్రం రెవెన్యూ లోటు-లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనైనా బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తగు ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది. అయితే ప్రభుత్వం కోరుకున్న విధంగా కొన్నిటికి నిధుల కేటాయింపు లేకపోయినా పన్ను ద్వారా ఆదాయం పెరగడంతో ఎపీ వాటా గతేడాది 9.15 వేల కోట్లు- వుండగా ఈ ఏడాది 10 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా.

అలాగే బడ్జెట్‌ లో ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ-కి 47 కోట్లు-, పెట్రోలియం యూనివర్సిటీ-కి 168 కోట్లు-, గిరిజన విశ్వవిద్యాలయాలకు 37 కోట్లు-, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు 683 కోట్లు-, మంగళగిరి, ఎయిమ్స్‌కు నిధుల కేటాయింపులు జరిగాయి. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద 41వేల338 కోట్లు- పెరగడం విశేషం. దీనికి తోడు ఆర్థిక లోటు- తగ్గడం మంచి పరిణామం. కొన్ని సెక్టార్లలో తక్కువ కేటాయింపులు చేశారు. రోడ్లు, రైల్వేలకు పెంచడం వల్ల రాష్ట్రంలో మౌలిక వసతుల మెరుగుదల కారణంగా రోడ్లు, రైల్వే, ఎయిర్‌ పోర్టులు అభివృద్ధితో ఏపీలో రవాణా రంగం పరిస్థితి బావుంటు-ందని అంచనా వేస్తున్నారు. కాగా వ్యక్తిగత పన్ను రాయితీల ప్రకటనతో రాష్ట్రంలో దాదాపు దాదాపు 10 లక్షలకు పైగా పన్నుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా నర్సింగ్‌ కాలేజీలు, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్లు, ఎయిర్‌ పోర్టులు, ఐటీ-డీఏ, ఆక్వాకల్చర్‌, గృహనిర్మాణం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు- వంటివి రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలుగా పరిగణిస్తున్నారు.
పంప్‌ స్టోరేజ్‌ విధానంలో ప్రపంచానికే ఏపీ రోల్‌ మోడల్‌గా నిలవనుంది. అర్బన్‌ ఇన్‌ఫ్రాడెవలప్‌ మెంట్‌ ఫండ్‌ రాష్ట్రానికి లాభం చేకూరనుంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో 40 శాతం, కేవలం రొయ్యల ఉత్పత్తిలోనే 60 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వాటి మేతకు సంబంధించిన దిగుమతి సుంకం తగ్గించాలన్న విజ్ఞప్తిని కేంద్రం స్వీకరించడం ఏపీలో ఆక్వా రంగ అభివృద్ధికి దోహదం చేకూరనుంది రాష్ట్రంలో అంతర్జాతీయ తరహాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు-, ఏకలవ్య స్కూళ్ల ప్రకటన, ఐటీ-డీఏ, ఆక్వాకల్చర్‌ వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలుగనుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున నైపుణ్య కేంద్రాల ఏర్పాటు-తో రాష్ట్రానికి సంబంధించిన 50వేల మంది యువతీ యువకుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడనుంది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు బడ్జెట్‌లో మైక్రో ఇరిగేషన్‌ క్రింద రూ.5,300 కోట్లు- కేటాయింపులు చేయడం జరిగింది. ఇదిలా వుండగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు జాతీయ గ్రాంట్ల రూపంలో ఈసారైనా బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశించింది. రాష్ట్ర విభజన జరిగిన 2014-15 ఆర్థిక ఏడాదిలో ఏర్పడ్డ రెవెన్యూ లోటు- భర్తీకి ఈసారి బడ్జెట్‌లోనైనా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు కేటాయిస్తారని ఆశించింది. అలాగే ప్రత్యేక అభివృద్ధి సాయంపై ఆశలు పెట్టు-కుంది.
ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్‌లో రూ.24,350 కోట్లు- నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. అలాగే విశాఖకు మెట్రో రైలు మంజూరు చేయడంతోపాటు- తగినన్ని నిధులు ఇవ్వాలని విన్నవించింది. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా సమర్పించింది. అలాగే ఈ బడ్టెట్‌లో మెట్రో రైలు ప్రకటనతో పాటు- కేంద్రం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్‌ నిధులు ప్రత్యేక హోదాతోపాటు- రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు- జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, ఆదాయపన్ను మినహాయింపు, 100 శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రీయింబర్స్‌మెంట్‌లను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. అయితే వీటి గురించి బడ్జెట్‌ లో ప్రస్తావన లేక పోవడం నిరాశకు చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ పేరుని కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావించలేదు. ఎన్నో ఆశలు పెట్టు-కున్నప్పటికీ వైజాగ్‌ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించలేదు. చాలాకాలంగా ఉన్న డిమాండ్‌ను బడ్జెట్‌లో ఏమాత్రం పరిగణులోకి తీసుకోలేదు. ఈ అంశాలు ఎపీ ప్రజలకు నిరాశను కలిగించాయి. కాగా కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేయగా.. వైకాపా ఎంపీ మిధున్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement