Sunday, November 3, 2024

Target – బెంగ‌ళూరులో రేవ్ పార్టీ – కాకానిని టార్గెట్ చేసిన సోంరెడ్డి…

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం.. ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. రాజకీయ నాయకుల ఆరోపణలు.. ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సంచలనాత్మకంగా మారింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీసమీపంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్‌తో కారు పాస్ పోర్టు చిక్కాయని, ఆ కారు తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ‘‘నకిలీ కల్తీ మద్యం కేసు, కోర్టులో ఫైల్స్ మాయమైన కేసులో తప్పు ఒప్పుకో లేదు నువ్వు.. రేవ్ పార్టీలో కూడా నాకు సంబంధం లేదని చెప్పక ఏమి అంటావ్’’ అని మండిపడ్డారు.

అత‌నితో కాకాణికి మంచి రిలేష‌న్ ఉంది..

రేవ్ పార్టీలో బెంగుళూరు డ్రగ్స్, కోకైన్ దొరికాయని, పోలీసులకు దొరికిన నలుగురు . నటోరియస్ డ్రగ్స్ నిందితులని, ఆ నలుగురు ఓ గ్యాంగ్ అని, ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి మంత్రి కాకాణికి మంచి మిత్రుడని సోమిరెడ్డి ఆరోపించారు. రేవ్ పార్టీతో సంబంధం లేనప్పుడు అక్కడ కారు స్టిక్కర్, పాస్ పోర్టు ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలో కాకాణికి సంబంధాలు ఉన్నాయన్నారు. ఐదు రాష్ట్రాల అంతరాష్ట్ర ముఠాతో కలిసి ఆయన పని చేశారని, ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. అక్రమ మైనింగ్, శాండ్, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేక అసాంఘిక కార్యకలాపాలతో కాకాణికి సంబంధాలు ఉన్నాయని, ఆయనపై ఒక పుస్తకం రాయవచ్చునని అన్నారు. సంఘ విద్రోహ శక్తులతో సంబంధం ఉన్నవ్యక్తి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement