Saturday, November 23, 2024

ఇరు రాష్రాల సీఎంల చ‌ర్చ.. సాలూరు ప్రజల్లో ఆనందం..

సాలూరు, (ప్రభ న్యూస్‌): కొఠియా గ్రూపు గ్రామాలతో పాటు-ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్ర మధ్య దశాబ్దాల కాలంగా వివాదస్పదంగా ఉన్న పలు సమస్యలపై ఉభయ రాష్ట్రాల్ర ముఖ్యమంత్రులు చర్చలు జరపడం పట్ల సాలూరు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొఠియా గ్రూపు గ్రామాల విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పట్టించుకొని, ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌ తో చర్చలు జరపడం అనేది చరిత్రలో మిగిలిపోతుందని అంటున్నారు. ఏదిఏమైనా కొఠియా గ్రూపు గ్రామాలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 21గ్రామాలను కొఠియా గ్రూపు గ్రామాలుగా పేర్కొంటారు. అయితే కొత్తగా ఏర్పడిన గ్రామాలతో కలిపి ప్రస్తుతం సుమారు 30 గ్రామాలయ్యాయి. ఇదిలావుండగా కొఠియా గ్రూపు గ్రామాలను ఒడిశా వారు కొఠియా పంచాయతీగా పేర్కొనగా, ఆంధ్రా ప్రదేశ్‌ మ్యాప్‌ ప్రకారం 21గ్రామాలు ఐదు పంచాయతీలకు మధుర గ్రామాలుగా ఉన్నాయి. అలాగే 21గ్రామాల్లో కొన్ని మాత్రం ఎటువంటి వివాదంలో లేని కురుకూటి, సారిక పంచాయతీలకు మధుర గ్రామాలుగా ఉన్నాయి.

కాగా కొఠియా గ్రామాల గొడవ సుదీర్ఘ కాలం కోర్టులో ఉండటంతో సుప్రీంకోర్టు 1963లో స్టేటస్కో విధిస్తూ ఇరు రాష్ట్రాల్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించు కోవాలని కోర్టు సూచించింది. అయినప్పటికీ ఆదిశగా నేటివరకు ఏ ముఖ్యమంత్రి అడుగు ముందుకు వెయ్యలేదు. దీనితో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరపడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement