ప్రజాగ్రహా సభలో రైల్వే జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో బీజేపీ తీరుపై మండిపడ్డారు. రాష్ర్ట నాయకులంతా మోదీతో, నిర్మలా సీతారామన్ తో మాట్లాడాలన్నారు. రాజకీయ పార్టీలకు ఎజెండా ప్రాధాన్యతలుంటాయని, సభలు పెట్టుకోవడంలో తప్పులేదని, అదేసమయంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమనేతగా అడుగుతున్నా చెప్పండి.. నాడు జైళ్ళలో పెట్టారు. ఏవ్యక్తి, పార్టీలను, వ్యవస్థలను కించపరచాలనే ఉద్యేశం కాదన్నారు. ప్రధానమైన సమస్యలు వదిలి ప్రజల్ని తప్పు దోవ పట్టించొద్దన్నారు. ఏ కారణాలతో చేయలేక పోయారో బీజేపీ నేతలు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గూర్చి చెప్పాలన్నారు. విద్యార్ది నాయకుడిగా పనిచేసిన నా గుండె రగిలిపోతుందన్నారు. ఎందరో సమర యోధులు స్టీల్ ప్లాంట్ కోసం అమరులయ్యారని, మహానీయుల త్యాగాలు ప్రైవేటైజ్ చేయటానికా సభ అని అన్నారు. ప్రత్యక్ష ఉద్యమంలో నాడు విద్యార్ది నాయకుడిగా పాల్గొన్నానని, ఖచ్చితంగా రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలని తమ్మినేని సీతారాం అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital