Tuesday, November 26, 2024

నీట్‌లో ప్రతిభచూపిన క‌ర్నూలు వాసి.. ఆలిండియా 894 ర్యాంక్‌..

కర్నూలు సిటీ (ప్రభన్యూస్‌): సెప్టెంబర్‌ 12న నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ (నీట్‌) 2021 ఫలితాలు విడుదలయ్యాయి. నీట్‌ పలితాలలో కర్నూలుకు చెందిన ముమ్మునిగె హన్షిక 894 ఆలిండియా ర్యాంకు సాధించి ప్రభంజనం సృష్టించింది. నీట్‌లో 720 మార్కులకు గానూ 680 మార్కులు సాధించి జిల్లాకే వన్నెతెచ్చింది.

హ‌న్షిక‌ తల్లిదండ్రులు సునీల్‌కుమార్‌, చంద్రకళ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. సునిల్‌కుమార్‌ జెన్‌కోలో డీఈఈగా పనిచేస్తుండగా, చంద్రకళ కర్నూలు జిల్లాపరిషత్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా, హన్సిక హైదరాబాదులోని చైతన్య విద్యాసంస్థల్లో జోనల్‌ క్యాంపస్‌లో ఇంటర్‌మీడియట్‌ చదువుకుంది. ఈమేరకు తల్లిదండ్రులు తన కూతురికి ఈ ర్యాంకు రావడం సంతోషాన్నిచ్చిందన్నారు.

న్యూరాలజిస్ట్‌ అవుతా..
తల్లిదండ్రుల ప్రోత్సాహం, లెక్చరర్ల సహకారంతోనే నాకు మంచి ర్యాంకు వచ్చింది. 10వ తరగతి వరకు కర్నూలు చైతన్య పాఠశాలలో చదివాను, జాతీయస్థాయిలో 894వ ర్యాంకు రావడం చాలా హ్యాపీగా ఉంది.. న్యూరాలజిస్ట్‌ కావాలన్నదే నా కోరిక. నాకు సహకారం అందించిన లెక్చరర్లకు, విద్యాసంస్థకు కృతజ్ఞతలు.

ఆలిండియా 23వ ర్యాంక్‌
హన్సిక నీట్‌లో ఆలిండియా ఎస్సి కేటగిరిలో 23వ ర్యాంక్‌ సాధించారు. పదో తరగతిలో 10/10 సాధించారు. ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు 986 సాధించారు. నీట్‌లో ఆలిండియా 894వ ర్యాంక్‌ సాధించగా ఎస్సి కేటగిరి 23 వ ర్యాంక్‌ సాధించిన హన్సిక డిల్లీ ఎయిమ్స్‌లో న్యూరో సర్జన్‌ కావాలన్నదే తన స్వప్పమని తెలిపారు. తనకు నిరంతరం మద్దతు తెలిపిన తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులకు హన్సిక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement