తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తెదేశం నాయకుడు బోయ సూర్యముని ఇంటిపై వైకాపా మూకల దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు . దీంతో ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడికి సమాయత్తమయ్యారు.. పొగబాంబులతో బయలుదేరిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ మురళీకృష్ణ రాళ్ల దాడిలో గాయపడ్డారు..రెచ్చిపోయిన వైసిపి కార్యకర్తలు పోలీసులకు చెందిన వజ్ర వాహనాన్ని ధ్వంసం చేశారు.. దీంతో అదనపు బలగాలను రప్పించి వైసిపి మూకలను అడ్డుకున్నారు పోలీసులు
మరోవైపు తాడిపత్రి పట్టణంలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసిపి కార్యకర్తల రాళ్ల దాడులు చేశారు.. దీంతో ప్రభాకరరెడ్డి వర్గీయులు ఎదురుదాడికి దిగారు అప్రమత్తమైన పోలీసులు వైసిపి కార్యకర్తలను అక్కడ నుంచి తరిమివేశారు….. ఈ సందర్బంగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో అదనపు బలగాలను దించారు.. 144 సెక్షన్ ఆంక్షలు విధించారు..