Friday, November 22, 2024

సిల‌బ‌స్ త‌గ్గించిన ఇంట‌ర్ బోర్డు..

విజయవాడ, (ప్ర‌భ‌న్యూస్) : ఇటీవలనే జూనియర్‌ కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, పని దినాలు చాలా మటుకు గడిచిపోవడంతో సిలబస్‌ను తగ్గించక తప్పని పరిస్థితి నెలకొన్నది. దాంతో 30 శాతం సిలబస్‌ తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తొలగించిన సిలబస్‌ను కళాశాలల్లో ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య బోధించేలా చర్యలు తీసుకోవాలని కళాశాలలకు ఇంటర్‌ బోర్డ్‌ సూచించింది. ఇంటర్‌ సిలబస్‌ మొదటి, రెండో ఏడాదిలో 30 శాతం తగ్గిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ మండలి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో 2020-21కి సీబీఎస్‌ఈ ఇప్పటికే 30 శాతం సిలబస్‌ను తగ్గించింది. . ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిర్వహించే పరీక్షల్లో 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయని, అందుకని విద్యార్థులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. సబ్జెక్ట్‌లవారీగా కుదించిన సిలబస్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement