Wednesday, November 20, 2024

ఏపీ టెన్త్ విద్యార్థుల‌కు తీపిక‌బురు.. బెట‌ర్ మెంట్ కు అవ‌కాశం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టెన్త్‌ విద్యార్థులకు తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి టెన్త్‌ విద్యార్థులకు బెటర్‌మెంట్‌ అవకాశమిచ్చింది. 50 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏదైనా రెండు సబ్జెక్ట్‌లకు సప్లిమెంటరీలో బెటర్‌మెంట్‌ రాసే అవకాశమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది.

ఇప్పటి వరకూ ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రమే బెటర్‌మెంట్‌ అవకాశం ఉంది. కాగా, రెండేళ్ల కోవిడ్‌ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల సౌలభ్యం కోసం బెటర్‌మెంట్‌ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement