Friday, September 6, 2024

Swearing Cermony – “చంద్రపవన” పట్టాభిషేకానికి సర్వం సిద్ధం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని 25 మంది సభ్యులతో కూడిన మంత్రి మండలి బుధవారం ప్రమాణస్వీకారం చేయనుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) నేతృత్వంలోని ప్రభుత్వంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏకైక ఉప ముఖ్యమంత్రి.

విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో జరగనున్న బహిరంగ కార్యక్రమంలో తనతోపాటు మంత్రి మండలితో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్ర వర్గ జాబితాను పంపారు.

10వేల మందితో భద్రత

Lప్రమాణ స్వీకార కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. 10వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. విజయవాడకు మూడు వేల మంది పోలీసులు, గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. 60మందికిపైగా ఐపీఎస్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు

- Advertisement -

ప్రముఖులు వీరే..

ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జితన్ రామ్ మంజి, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పాటెల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పాటెల్, మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులుకూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

.

చంద్రబాబు షెడ్యూల్ ఇలా..

09:45 గంటలకు చంద్రబాబు తన నివాసం నుంచి బయలు దేరుతారు.10:20 గంటలకు ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు.11 గంటలకు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటారు.11-12:30 గంటల మధ్యలో ప్రమాణ స్వీకార మహోత్సవం. ప్రధానికి సెండాఫ్ ఇచ్చేందుకు 12:40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు వెళ్తారు.మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు తన నివాసానికి చేరుకుంటారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement