Friday, November 22, 2024

AP: స్వామీ.. చంద్రబాబు పాపాన్ని తొల‌గించు..

ఏపీలోని ఆలయాల్లో వైసీపీ పాప ప్రక్షాళన పూజలు
చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు


ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుపతి ప్రతినిధి : తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి ప్రసాదం విశిష్టతను, స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారని, ఆయ‌న పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేపట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు పాపం ప్రక్షాళన పేరిట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. తిరుమల లడ్డూ విశిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్సీపీ నిరసనలు వ్యక్తం చేశారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో మాజీ టీటీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్​ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ప్రత్యేక పూజలు చేశారు.

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామవరపుకోట వీరభద్రస్వామి ఆలయంలో చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, మద్ది ఆంజనేయస్వామి గుడి మాజీ చైర్మన్ సరితారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మిడతా రమేష్, పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించారు.

- Advertisement -

తూర్పుగోదావరి: చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పూజలు చేశారు. బొమ్మూరు ఆలయంలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాజానగరం ఆలయంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పూజలు నిర్వహిస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు.

చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించు : భూమన
చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు నిర్వహించారు. అనంతరం భూమన కరుణాకర్​ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ అపవాదు మూటగట్టారని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం హోదాలో ని వ్యక్తిపై తప్పుడు వాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను శ్రీవారి దర్శనానికి రాకుండా అడ్డుకున్నారని, రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement