Tuesday, November 19, 2024

Nandyala: మున్సిపాలిటీలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్…

నంద్యాల బ్యూరో, ఆగస్టు 22 (ప్రభ న్యూస్) : జిల్లా కేంద్రమైన నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల మేరకు… వివాదాస్పద స్థలానికి ఖాళీ స్థలం పన్ను విధించడంపై వేటు వేశారు. ఈ స్థలంపై కోర్టులో వివాదం నడుస్తుండగా పన్ను వేయడంలో బాధ్యులైన ముగ్గురు ఉద్యోగస్తులను సస్పెండ్ చేశారు. ఖాళీ స్థలానికి పన్ను వేయడంలో చక్రం తిప్పిన మాజీ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడిని విధులు నుంచి తొలగించారు. పురపాలక సంఘం రెవెన్యూ ఇన్ స్పెక్ట‌ర్ కృష్ణ, మరో ఉద్యోగి గులాం హుస్సేన్, 35వ వార్డు అడ్మిన్ సెక్రటరీ సుధాకర్ లను సస్పెండ్ చేశారు.

ఖాళీ స్థలానికి పన్ను వేయడంలో వీరు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని, కోర్టులో కేసు ఉన్నప్పటికీ వీరు నిబంధనలు పాటించకుండా వ్యవహరించారన్న ఆరోపణలతో సస్పెండ్ చేశారు. ఇందులో చక్రం తిప్పిన సూత్రదారులు, పాత్రదారులు గుప్ చుప్ గా ఉండటం విశేషం. మున్సిపాలిటీలోని మరో ఉద్యోగిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది. పన్ను విధింపులో కీలకంగా మారిన సర్వే శాఖ ఎంజాయ్ మెంట్ రిపోర్ట్, భూమి కొలతలు వేయకుండానే జారీ అయిన సర్వే రిపోర్ట్, మున్సిపాలిటీలో పలు అవినీతి ఆరోపణలున్నాయి.

మంత్రి సీరియస్… పురపాలక శాఖ మంత్రికి ఫోన్ లో ఫిర్యాదు…
నంద్యాల జిల్లాలో మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. మంత్రి స్థలానికే భద్రత లేనప్పుడు, పట్టణ ప్రజల స్థలాలకు ఎలాంటి భద్రత ఉంటుందని, వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement