Friday, November 22, 2024

బహిష్కరణ ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వీ గండం…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : అధికార వైసీపీ బహిష్కరణకు గురైన నలుగురు శాసనసభ్యులు సాంకేతికంగా ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోబోతు న్నారు. పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా వారికి గండం పొంచిఉంది. ప్రస్తుతానికి పార్టీ నుండి వారిని సస్పెండ్‌ చేసినప్పటికీ అనర్హత వేటు వేయడానికి జరగాల్సిన ప్రక్రియపై అధిష్టానం ఫోకస్‌ పెట్టింది. అందుకు సంబంధించిన చర్యలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. దీంతో రాజకీ యవర్గాల తో పాటు అటు వైసీపీలోనూ కొత్త చర్చ మొదలైంది. కొంత మంది శాసనసభ్యులు అధిష్టానం తీరుపై తీవ్ర అసం తృప్తితో ఉన్నారని సమాచారం ఇవ్వడం తోపాటు 26 మంది సభ్యులతో జాబితాను కూడా తయారుచేసి అధిష్టానానికి అందించింది. ఈనేపథ్యం లో పార్టీ గీత దాటిన నలుగురిపై వేటు పడటంతో అస మ్మతి నేతల్లో కూడా తెలియని గుబులు వెంటా డుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అంశంపై చర్చ నడుస్తుంది.

రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ ఒకేసారి ఒకే సందర్భంలో ఒకే పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులను పార్టీ నుండి సస్పెండ్‌ చేసిన దాఖలాలు లేవు. బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం లోనూ ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలోనూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహ రించారని ఒకరిద్దరు శాసనసభ్యులను మాత్రమే సస్పెండ్‌ చేశారు. అయితే, రాష్ట్ర చరిత్రలో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురికా వడం ఇదే మొదటి సారి. వారిలో ఇద్దరు గత మూడు నెలలుగా వివిధ కారణాలవల్ల పార్టీకి దూరంగా ఉంటుండగా మరో ఇద్దరు రెండు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటు వేశారన్న కారణంతో అధిష్టానం వారిని పార్టీ నుండి బయటకు సాగనంపింది. 2010లో ఆవిర్భవించిన వైసీపీ నుండి ఇప్పటి వరకూ ఒక్క ఎమ్మెల్యే కూడా సస్పెండ్‌ కాలేదు. గతంలో ఇదే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అధినాయకుడు జగన్‌ ఆదేశాలతో తమ పదవులకు రాజీనామా చేశారు. 2009లో కాంగ్రెస్‌లో గెలిచిన నెల్లూరు ఎంపీ మేక పాటి రాజమోహన్‌ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి (టీడీపీ) అప్పట్లో జగన్‌ వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మేకపాటి సోదరులు కాంగ్రెస్‌ పార్టీకి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామ చేశారు. అలాగే నల్లపరెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి అదే స్థానాల నుండి వైసీపీ అభ్యర్దులుగా పోటీచేసి గెలుపొందారు. అయితే 2013 చివరిలో ప్రత్యేక హోదా కోసం అప్పటి నెల్లూరు ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్‌ రెడ్డి జగన్‌ ఆదేశాల మేరకు వరుసగా రెండోసారి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇలా పార్టీకోసం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు గతంలో పదవులకు మాత్రమే రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement