నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. రఘురామ తన వైద్యపరీక్షలకు అయ్యే ఖర్చులు ఆయనే భరించాలని కోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామ ఉండే సమయాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని కూడా తెలిపింది. అలాగే రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణం రాజును నేడు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్, వైద్య పరీక్షల కోసం తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వైసీబీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వైద్యపరీక్షలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదింపుతూ జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్ తో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రభావం లేకుండా ఆయన వైద్య పరీక్షలకు మార్గం సుగమమైంది.