దేశ వ్యాప్తంగా ప్రకంపణలు సృష్టించిన పెగాసెస్ స్పై వేర్ హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు చేసింది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు సాంకేతికి నిపుణులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. జస్టిస్ ఆర్ వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొంది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని స్పష్టంచేసింది. తీర్పు సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత భద్రతా పౌరుల హక్కని, విచక్షణా లేని నిఘా ఆమోదం యోగ్యం కాదని స్పష్టం చేశారు. జాతీయ భద్రత పేరుతో కేంద్రం ప్రతీసారి తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టు సహించదన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.